రేపు మోడీ పర్యటన నేపథ్యంలో జమ్మూలో భారీ భద్రత

రేపు మోడీ పర్యటన నేపథ్యంలో జమ్మూలో భారీ భద్రత

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా రేపు జమ్ము కశ్మీర్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. దీంతో జమ్ములోని సంబా జిల్లా పల్లీ గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లీ గ్రామం నుంచే గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటనకు ముందు జమ్ముకశ్మీర్ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే లక్ష్యంగా కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదుగురు సర్పంచ్ లు హత్యకు గురయ్యారు. 

నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే అక్కడ 20 సార్లు పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఉగ్రవాదాన్ని అరికట్టాలనే ప్రాథమిక లక్ష్యంతో కేంద్రం... 2019 ఆగస్టులో 370 ఆర్టికల్ ను రద్దు చేసింది. జమ్ము కశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించి.. జమ్ము కశ్మీర్, లడక్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత జమ్ములో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. 2019, 2021లో జమ్ముకశ్మీర్ కు వెళ్లినా.. సరిహద్దుల్లో సైనిక బలగాలతో దీపావళి నిర్వహించుకునేందుకే పరిమితమయ్యారు. ఈసారి మాత్రం స్థానికంగా పర్యటించనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకావత్ అరెస్ట్

టీచర్ నిర్వాకం..స్కూల్కు 20 లక్షల బిల్లు