పంజాబ్లో కొలువుదీరిన కొత్త కేబినెట్

పంజాబ్లో కొలువుదీరిన కొత్త కేబినెట్

చండీగఢ్: పంజాబ్ లో కొత్త కేబినెట్ కొలువుదీరింది. మంత్రులుగా 10 మంది ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ లోని  రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హర్పాల్ సింగ్ చీమా, బల్జిత్ కౌర్, విజయ్ సింగ్లా, లాల్ చంద్, గుర్మీత్ సింగ్, కుల్దీప్ సింగ్, లల్జిత్ సింగ్ భుల్లర్, బ్రహ్మ శంకర్ జింపా, ఆనంద్ పూర్ సాహెబ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాసేపట్లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన నూతన కేబినెట్ సమావేశం కానుంది. మంత్రుల ప్రమాణ స్వీకారానికి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా హాజరయ్యారు. ఇక అసెంబ్లీ స్పీకర్ గా కుల్తార్ సింగ్ సంధ్వాన్ను నామినేట్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.

మరిన్ని వార్తల కోసం:

భగ్గుమంటున్న భానుడు

మంచు గుప్పిట్లో కశ్మీరం

ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఫైర్