2024 జనరల్​ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం : అమర్త్య సేన్

2024 జనరల్​ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకం : అమర్త్య సేన్

కోల్‌‌కతా: 2024 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఏకపక్షంగా ఫలితాలు వస్తాయనుకుంటే పొరపాటేనని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ అన్నారు. జనరల్ ఎలక్షన్లలో ప్రాంతీయ పార్టీలే ముఖ్య పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. దేశానికి తర్వాతి ప్రధాని అయ్యే సామర్థ్యం బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఉందని, అయితే బీజేపీ వ్యతిరేక శక్తులను ఆమె ఏకం చేయగలరా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. డీఎంకే, టీఎంసీ, ఎస్పీ.. తదితర ప్రాంతీయ పార్టీ లు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారతయ ని అనుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఇండియా విజన్‌‌ను బీజేపీ తగ్గించింది. కేవలం హిందూ ఇండియా గా, హిందీ మాట్లాడే ఇండియాగా చాలా బలమైన రీతిలో కుదించింది’’ అని చెప్పారు.