బస్సును నడిపి డ్రైవర్ ను రక్షించిన ఓ మహిళా

బస్సును నడిపి డ్రైవర్ ను రక్షించిన ఓ మహిళా

మినీ బస్సులో అందరూ సరదాగా విహార యాత్రకు వెళ్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ..జోరుగా హుషారుగా అంటూ  పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి జర్నీ కొద్ది దూరం హాయిగా సాగింది. సడెన్ గాడ్రైవర్ అస్వస్థతకు గురై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశాడు. అతడికి ఏం జరిగిందో తెలియదు. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. అంతే బస్సులో ఉన్నవారందరూ షాక్ కు గురయ్యారు. ఏం చేద్దామా అని అందరూ ఆలోచించుకునే సమయంలో  యోగితా సతవ్ ముందుకు వచ్చింది. ఆపదలో ఉన్న డ్రైవర్ ను కాపాడేందుకు డ్రైవర్ సీటులో కూర్చొని డ్రైవింగ్ చేసింది. అతి కష్టం మీద మహారాష్ట్రలోని పూణెకి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిక్రాపూర్ పట్టణంలోని ఆస్పత్రి వరకు వాహనం నడిపింది. సకాలంలో డ్రైవర్ కు మెరుగైన వైద్యం అందడంతో అతడు బతికి బయటపడ్డాడు.ఆపద సమయంలో ఆమె చూపిన తెగువ, ధైర్య సహాసాలను చూసి అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రైవర్ ను ఎలా కాపాడరనే దానిపై కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఓ యాడ్ రూపంలో షూట్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది.  ఈ వీడియో రికార్డులను బ్రేక్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు యోగితా సతవ్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం: జెలెన్స్కీకి మోడీ ఫోన్ కాల్ 

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్