ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు..!

ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు..!

కరోనా అన్నిరంగాలపై తన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచగతినే పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటికే ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయారు. జీతాల్లోనూ కోతలు మొదలైపోయాయి. జాబ్​ చేస్తున్న వాళ్లకు కూడా ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో, ఎంతకాలం పాటు ఉంటుందో గ్యారెంటీ లేదు. ఈ క్రైసిస్​లో నిలదొక్కుకుని, ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఇప్పటికే లాక్​డౌన్​ మొదలై చాలాకాలం అయిపోయింది. పెద్దపెద్ద ఇండస్ట్రీలు, కార్పోరేట్ ఆఫీసులు ఈ దెబ్బకు నష్టాలను చూస్తున్నాయి. ఎంతో మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ నష్టం మరింత పెరుగుతుందని, మరింత మంది ఉద్యోగాలు పోతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో మనకున్న స్కిల్స్​ను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.

లీడర్​షిప్ క్వాలిటీస్​​

ఒక షిప్​ ప్రమాదంలో ఉంటే… ఆ ఆపద నుంచి మంచి కెప్టెన్​ మాత్రమే కాపాడగలడు. ఇలాంటప్పుడు కంపెనీని కాపాడుకోవడానికి అలాంటి బాస్​లే అవసరం. ఇప్పటికే పెద్దపెద్ద ఐటీ కంపెనీలన్నీ ఈ ఏడాది మొత్తం… తమ ఎంప్లాయిస్​ని వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేయమని అంటున్నాయి. వర్క్​ ఫ్రమ్​ హోం చేస్తున్న టీంని నడిపించడానికి ఆ టీం లీడర్​ కచ్చితంగా కొన్ని అదనపు స్కిల్స్​ పెంచుకోవాలి. ఒకప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ తెలివితేటలతో వ్యవహరించాల్సి ఉంటుంది. రెగ్యులర్​గా ఆఫీస్​ నడిచే రోజులకంటే, టీం లీడర్లకు ఇప్పుడు ఎక్కువ స్కిల్స్​ అవసరం.

ఎమోషనల్​ ఇంటెలిజెన్స్​

ఈ ప్రత్యేకమైన సందర్భంలో… ప్రతి ఉద్యోగికీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం. ఎమోషన్స్​ను ఎక్సెప్రెస్​ చేయడంలోనూ, దాచుకోవడంలోనూ మెచ్యూరిటీని చూపాలి. సాఫ్ట్​వేర్​ రంగంలో పైస్థాయిలో ఉన్న వాళ్లందరిలో ఈ క్వాలిటీ కనపడుతుంది. జాబ్​ పోతుందేమో అనే భయం,  ఒత్తిడి మన పని మీద ప్రభావం చూపుతాయి. చివరికి మనం తెచ్చిపెట్టుకున్న ఒత్తిడి, భయమే జాబ్ కోల్పోవడానికి కారణం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వీలైనంత కూల్​గా పనిచేసుకుంటూ పోవాలి.

టెక్నికల్ స్కిల్స్​…

లాక్​డౌన్ మొదలయ్యాక… దాదాపు అన్ని ఉద్యోగాలూ వర్క్​ ఫ్రమ్​ హోం అయిపోయాయి. టెక్నికల్​గా ఇంప్రూవ్​ అవ్వాల్సిన అవసరం బాగా పెరిగిపోయింది. ఆన్​లైన్​ మీటింగ్​లు పెరిగిపోయాయి. ఆఫీస్​కు సంబంధించిన చర్చలన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఒక్కసారిగా వచ్చేసిన ఈ కొత్త పద్ధతులతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు టెక్నికల్​గా తమని మెరుగుపరుచుకున్నారు. చాలా కంపెనీల్లో ఇప్పుడు టెక్నికల్​ స్కిల్స్​నే ఉద్యోగిలోని ప్రధానాంశంగా చూస్తున్నారు. ఎంప్లాయిస్​ని తగ్గించుకునే ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు.

మార్పులకు సిద్ధంగా…

సహజంగానే మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మరింత సిద్ధంగా ఉండాలి. పూర్తిగా లాక్​డౌన్​ తొలగిపోయాక కూడా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. వర్కింగ్​ అవర్స్​ ప్రతిరోజూ మారుతూ ఉండొచ్చు. ఏరోజు ఇంటి నుండి పనిచేయాలో, ఎప్పుడు ఆఫీస్​కు వెళ్లాలో చివరి క్షణం వరకూ తెలియకపోవచ్చు. ఏ సమయంలోనైనా, ఎలాంటి సిచ్యుయేషన్స్​లో అయినా వర్క్​ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో జాబ్​ కాపాడుకోవాలంటే ఇలా అన్నింటికీ రెడీ అయి ఉండాలి.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి