
ఓవైపు సోలో హీరోగా నటిస్తూనే, స్టార్ హీరోల చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తున్న సుశాంత్... వరుస క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు . ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన సుశాంత్.. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘రావణాసుర’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పుడు చిరంజీవితోనూ స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘భోళా శంకర్’ మూవీలో సుశాంత్ కీలకపాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఇందులో ఆమెకు లవర్ పాత్రలో సుశాంత్ నటిస్తున్నట్లు.. శనివారం తన బర్త్‌డే సందర్భంగా రివీల్ చేశారు. దీనిపై స్పందించిన సుశాంత్ ‘మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.