
దళిత బంధు కొత్త స్కీం కాదని... మోడీ ఏనాడో స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రశపెట్టారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో సబ్బండవర్గాల ప్రజలు త్యాగం చేశారన్నారు. రాష్ట్రంలో అనేక పథకాలను కేంద్రం నిధులిస్తోందని.. కానీ ఫోటో మాత్రం కేసీఆర్ పెట్టుకుంటున్నారన్నారు సంజయ్. తన పాదయాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ఇల్లంతకుంట చేరుకున్న బండి సంజయ్ అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్ ని జైలులో పెడతామన్నారు. రాష్ట్రంలోని దళితులు, బహుజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళిత బంధు కొత్త స్కీం కాదని... మోడీ ఏనాడో స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రశపెట్టారని చెప్పారు. ఒక్క హుజురాబాద్ లోనే దళితబంధు ఎందుకు ఇస్తున్నారని, మానకొండూరు నియోజకవర్గంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ కోసం సబ్బండవర్గాల ప్రజలు త్యాగం చేశారని చెప్పారు. కేంద్రం ఏనాడు ధాన్యం కొనదని చెప్పలేదని... కేసీఆరే వరి వేస్తు ఊరి అని ప్రకటించారన్నారు సంజయ్. రైతులు పండించిన పంటనంతా... కేంద్రమే కొనేలా చూస్తానని చెప్పారు. కేసీఆర్ కేవలం మధ్యవర్తేనన్నారు.