కవిత అరెస్ట్ అయితే.. WHAT NEXT..?

కవిత అరెస్ట్ అయితే.. WHAT NEXT..?

ఉమెన్స్ డే రోజు ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితకు  (mlc kavita) ఈడీ నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇష్యూపై ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ చర్చలు కొనసాగుతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై మాట్లాడుకుంటున్నారు. కవిత అరెస్ట్ తప్పదా..? ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..? అనేదానిపై చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ నాయకులు కేంద్రప్రభుత్వంతో పాటు దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతున్నారు. అంతర్జాతీయ (womens day) మహిళా దినోత్సవం రోజు తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పిదాలను (delhi liquor scam)ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారనేది బీఆర్ఎస్ వర్గాల టాక్. మరోవైపు కొంతమంది నేతలు మరోలా మాట్లాడుతున్నారు. ఈ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా తిరిగి వస్తారని దీమా వ్యక్తం చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి నాయకులు చెబుతున్నారు.    

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలుగు రాష్ట్రాలనే కాదు.. యావత్ దేశాన్నే కదిలిస్తోంది. ఇదే కేసులో మన పొరుగు రాష్ట్రం ఏపీకి చెందిన వైఎస్ఆర్ సీపీ ఎంపీ మాగుంట  శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. దీంతో ఏపీలో కూడా దీనిపై చర్చ సాగుతోంది. వైసీఆర్ సీపీ సైతం ఆచితూచి స్పందిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించనేలేదు. 

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీతో పాటు కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇవాళ లేదా రేపో కవిత అరెస్ట్ తప్పదనే ప్రచారం చేస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై (arun pillai) బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడంతోనే కవితకు.. మహిళా రిజర్వేషన్ బిల్లు (ED)గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందంటూ సెటైర్లు వేస్తోంది. దీనికి బీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ప్రస్తుతం మెజార్టీ సభ్యులు పార్లమెంటులో బీజేపీకి ఉన్నందున.. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేలా చూడాలని మోడీ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది.

అరెస్ట్ తప్పదా..?

ఒకవేళ ముఖ్యమంత్రి కూతురును అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..? ఈ విషయంలో కేసీఆర్ తర్వాత స్టెప్ట్ ఏంటి..? ఎప్పటి నుంచో కేంద్రాన్ని ఢీకొంటున్న కేసీఆర్.. మరింత రెచ్చిపోనున్నారా..? ప్రతిపక్ష పార్టీల అధినేతలను, బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను కలుపుకొని వెళ్తారా..? ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వారితో, విచారణను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారా..? అనే చర్చలు సాగుతున్నాయి. మరీ దీనిపై బీజేపీ, కాంగ్రెస్ ఎలా స్పందిస్తాయో చూడాలి.  ప్రస్తుతానికైతే అన్ని పార్టీలు ఈ విషయాన్ని చాలా నిశితంగా.. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ప్రెస్ మీట్లలో ఇదే అంశంపై ఎలా మాట్లాడాలనే దానిపైనా ఒకటికి, పది సార్లు చర్చించిన తర్వాతే నాయకులు స్పందించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో ఏది పడితే అది మాట్లాడి పరువు పొగొట్టుకోవడం కంటే అన్ని తెలుసుకున్న తర్వాతే స్పందించాలని భావిస్తున్నారు. 

దీక్ష ఉంటుందా...? ఉండదా..? 

మహిళా రిజర్వేషన్​ బిల్లు తీసుకురావాలని (ED) కేంద్రంపై ఒత్తిడి చేస్తూ.. ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని ప్లాన్ చేశారు. అయితే.. గత 9 ఏండ్లుగా గుర్తుకురాని మహిళా రిజర్వేషన్​ బిల్లు కవితకు ఇప్పుడెందుకు ఇంత అకస్మాత్తుగా తెరమీదకు వచ్చిందనేది ఆశ్చర్యకరమే. (delhi liquor scam)  2014 నుంచి 2018 తెలంగాణ క్యాబినెట్​లో ఏ ఒక్క మహిళా మంత్రి లేరు. అప్పుడు కవితకు మహిళల హక్కులు, సాధికారత ఎందుకు యాదికిరాలేదని ప్రతిపక్షాలు ప్రశ్నలు సంధిస్తూ.. ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.