తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో  3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మండు వేసవిలో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలు గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.ఈ వర్షాలు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. 

గత 4, 5 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ నగరం కూడా చల్లబడింది. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో భానుడి భగభగల నుంచి నగరజీవి సేదదీరుతున్నాడు. ఇటీవలి వరకు తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఆదిలాబాద్ లోని జైనథ్ వద్ద 45 డిగ్రీల సెల్సియస్ తీవ్రతతో ఉష్ణోగ్రత నమోదైంది.

మరిన్ని వార్తల కోసం..

 

ఢిల్లీ క్యాపిటల్స్‌ క్రీడా స్ఫూర్తిని మరచింది

గాడిదల పరుగు పందెం

V6 న్యూస్ చానెల్ కు జాతీయస్థాయి అవార్డు