New Movie Titles: టాలీవుడ్ హీరోల కొత్త సినిమాల టైటిల్స్ ఇవే!..మీ ఫేవరేట్ హీరో టైటిల్పై లుక్కేయండి..

New Movie Titles: టాలీవుడ్ హీరోల కొత్త సినిమాల టైటిల్స్ ఇవే!..మీ ఫేవరేట్ హీరో టైటిల్పై లుక్కేయండి..

వెండితెరపై రెండున్నర గంటల సినిమా చూడటానికి ఎంతో హుషారుగా వెళతాం.ఆ సినిమాలో నటించే హీరోలపై ప్రేమతో,ఆ డైరెక్టర్ రాసుకునే స్టోరీపై నమ్మకంతో.కానీ,అంతకు ముందు మనలో ఒక చిన్న పాజిటివ్ వైబ్ సినిమాపై మరింత ఇష్టపడేలా చేస్తుంది.అదే ఆ సినిమాకు మేకర్స్ పెట్టె "టైటిల్".

ఎంత పెద్ద స్టార్ సినిమాకి అయినా హిట్ బొమ్మ పడాలంటే 'ఒక్క టైటిల్'మాత్రమే డిసైడ్ చేస్తుందంటే నమ్మగలరా? అందుకే మనందరం పేరు లేని సినిమాని ఊహించలేం.ప్రేక్షకుడిని ఆకర్షించడంలోనూ..థియేటర్‌ వరకూ తీసుకు రావడంలోనూ సినిమా టైటిల్‌ది ముఖ్య పాత్ర అని చెప్పొచ్చు.మరి ఇపుడు టాలీవుడ్లో లేటెస్ట్గా షూటింగ్ షురూ చేసిన టాప్ హీరోల సినిమాకు ఎలాంటి టైటిల్స్ పెట్టబోతున్నారో ఒక లుక్కేద్దాం. 

ALSO READ | డార్లింగ్ మూవీ నుంచి .. 3rd లిరికల్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే.కొన్నిసార్లు ఆ టైటిల్స్ ఫిక్స్ అవుతున్నాయి.మరికొన్ని సార్లు చివర్లో మారుతుంటాయి. ఏదేమైనా,ఏదో విధంగా సినీ సర్కిల్ నుండి టైటిల్ లీక్స్ మాత్రం జరుగుతూ ఉంటుంది.మరి ఇప్పుడు ఆ టైటిళ్ల గుసగుసలు ఏంటో విందామా... 

బాబీ డైరెక్షన్స్ లో స్టార్ హీరో బాలయ్య బాబు నటిస్తున్న NBK 109 వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి బాలయ్య మాస్ కి తగ్గట్టుగా ‘వీర మాస్‌’అనే టైటిల్ వినబడుతుంది.ఇక ఇదే టైటిల్ పెట్టె ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.

ALSO READ | Anant Ambani Wedding: అంబానీ పెళ్లిలో తెలుగు హీరోల సందడి..మన హీరోల ముందు తేలిపోయిన బాలీవుడ్ స్టార్స్!

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్‌చరణ్‌ హీరోగా వస్తోన్న తాజా మూవీకి ‘పెద్ది’అనే పేరు వినబడుతోంది.పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర,క్రీడా నేపథ్యంతో కూడిన కథాంశంతో రాబోతుంది. 

సలార్ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా NTR31 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కనుంది.దీనికి ‘డ్రాగన్‌’అనే పేరు ప్రచారంలో ఉండగా చివరికి ఏమవుతుందో చూడాలి.

వరుస విజయాలతో తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న డైరెక్టర్ అనిల్‌ రావిపూడి తన కొత్త సినిమాను వెంకీ మామ తో షురూ చేశాడు.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది.దీంతో ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’అనే టైటిల్ తో పాటు మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. 

ALSO READ | Hunger: ఈ షార్ట్ ఫిలిం చూశారా? ఏకంగా 10 అంతర్జాతీయ అవార్డులు..ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్ వచ్చేస్తుండు!

ఇకపోతే, బింబిసార సక్సెస్ తో కల్యాణ్‌రామ్‌ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.ఒకటి బింబిసార మూవీకి సీక్వెల్ కాగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో మరో సినిమా రానుంది.ఈ మూవీకి ‘మెరుపు’అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.అలాగే.సాయి దుర్గా తేజ్‌ హీరోగా రోహిత్‌ అనే యంగ్ డైరెక్టర్ తో చేస్తున్న మూవీకి ‘సంబరాల ఏటిగట్టు’అనే టైటిల్ వినిపిస్తోంది. 

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్‌ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.అందులో ఒకటి సామజవరగమన ఫేమ్ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రానున్న మూవీకి  ‘నారీ నారీ నడుమ మురారి’అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.అలాగే లూజర్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అభిలాష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాకి ‘రేస్‌ రాజా’అనే పేరు పెట్టినట్లు టాక్.

ALSO READ అశ్విన్ బాబు శివం భజే .. ఆగస్టు 1న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ రిలీజ్

ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్‌ వరసగా మూడు సినిమాలు చేస్తున్నాడు.అందులో ఒకటి టైసన్ నాయుడు కాగా మరొకటి ‘కిష్కిందపురి’,ఇంకొక సినిమాకి ‘హైందవ’అనే టైటిల్స్  ఫిక్స్ చేసినట్లు ప్రచారంలో ఉన్నాయి.అలాగే దర్శక ధీరుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు మహారాజ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఇక ఈ తాజా లిస్ట్ లో ఏ టైటిల్ ఫిక్స్ అవ్వనుందో చూడాలి.