రేప్ జరిగిన తర్వాత రా.. కంప్లైంట్ తీసుకుంటాం: మహిళతో పోలీసులు

రేప్ జరిగిన తర్వాత రా.. కంప్లైంట్ తీసుకుంటాం: మహిళతో పోలీసులు

‘అత్యాచారయత్నమే కదా.. రేప్ జరగలేదుగా.. రేప్ చేస్తే అప్పుడు రా.. కేసు ఫైల్ చేస్తాం’… ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా సిందుపూర్ గ్రామంలో తనపై అత్యాచార యత్నం జరిగిందంటూ శనివారం ఓ మహిళ కేసు పెట్టడానికి వెళ్తే పోలీసుల నుంచి వచ్చిన స్సందన ఇదీ.

రెండ్రోజుల క్రితం కోర్టుకు వెళ్తుండగా కిరోసిన్ పోసి తగలబెట్టగా ప్రాణాలు కోల్పోయిన రేప్ బాధితురాలిది కూడా అదే గ్రామం.

పోలీసుల చుట్టూ తిరుగుతున్నా.. మార్పు లేదు

తాను మూడు నెల క్రితం మెడికల్ షాప్‌కు వెళ్తుండగా తమ గ్రామానికి చెందిన ఐదుగురు తన బట్టలు లాగేసి, రేప్ చేయడానికి ప్రయత్నించారని ఆమె తెలిపింది. వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించానని, అయితే వాళ్లు తనను బయటకు గెంటాశారని చెబుతోందామె. రేప్ జరిగిన తర్వాత రావాలన్నారని చెప్పింది.

‘నాడు తొలుత 1090 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే 100కి ఫోన్ చేయాలని చెప్పారు. 100కి చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని సూచించారు. స్థానిక బీహార్ స్టేషన్‌కి వెళ్తే కంప్లైంట్ తీసుకోలేదు. ఉన్నావ్ జిల్లా ఉన్నతాధికారులను కలిశా. వాళ్లు మళ్లీ లోకల్ పోలీస్ స్టేషన్‌కే వెళ్లాలని చెప్పారు. మూడు నెలలుగా ఇదే జరుగుతోంది. రేప్ ఘటనలపై దేశమంతా నిరసనలు జరుగుతున్న ఈ తరుణంలో మళ్లీ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లా. అయినా ఇప్పటికీ వాళ్లలో మార్పులేదు’ అని చెప్పింది బాధిత మహిళ.

MORE NEWS:

రేప్‌లు జరగొద్దంటే ఈ మార్పు రావాలి

ఉన్నావ్ రేప్ బాధితురాలు మంటల్లో కాలుతూనే.. కిలోమీటరు పరుగు

రేప్ కేసులపై హైకోర్టు సీజేలు, సీఎంలకు లేఖ: కేంద్రం

రేప్ జరిగాక ఇంకేం న్యాయం చేస్తారు

ఇప్పుడు రేప్ జరగలేదు కదా.. రేప్ జరిగిన తర్వాత వస్తే కేసు తీసుకుంటాం అని అంటున్నారని, రేప్ జరిగాక వాళ్లు తనకు ఏం న్యాయం చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరోవైపు తనపై రేప్ అటెంప్ట్ చేసిన ఆ దుర్మార్గులు రోజు తన ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని ఆమె చెబుతోంది. కేసు పెడితే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని తెలిపిందామె.

ఓ వైపు హైదరాబాద్ దిశపై రేప్ చేసి, తగలబెట్టిన కేసు.. మరోవైపు కోర్టుకు వెళ్తున్న ఉన్నావ్ రేప్ బాధితురాలిని తగలబెట్టిన కేసు.. రెండింటిలోనూ పోలీసులు నిర్లక్ష్యం ఉందని విమర్శలు వస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం.