ఇమ్రాన్‌‌‌‌ ఓ కీలుబొమ్మ ప్రధాని

ఇమ్రాన్‌‌‌‌ ఓ కీలుబొమ్మ ప్రధాని

ప్రభుత్వ వ్యవహారాల్లో మిలటరీ జోక్యం
ఫారెన్‌ , సెక్యూరిటీ విధానాలపైనా ఆర్మీ ప్రభావం
యూఎస్‌ కంగ్రెషనల్‌ రిపోర్ట్‌‌‌‌ఎందుకిలా?

పాకిస్తాన్‌‌‌‌లో ప్రజలు ఎన్నుకున్న  ప్రభుత్వం పనిచేస్తోందంటే పనిచేస్తోంది. పాలనలో  దాని ప్రభావం  అస్సలుండదు.  మిలటరీదే అక్కడ పైచేయి.   ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌ కీలుబొమ్మ ప్రధాని మాత్రమే.  ఆదేశంలోని ఫారెన్‌‌‌‌, సెక్యూరిటీ  పాలసీలన్నీ మిలటరీ ప్రభావంతోనే తయారవుతాయి. పాక్‌‌‌‌లోని ప్రస్తుత పరిస్థితిపై తయారైన  యూఎస్‌‌‌‌ కంగ్రెషనల్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ సారాంశం ఇది.   ‘పాకిస్తాన్‌‌‌‌ డొమెస్టిక్‌‌‌‌ పొలిటికల్‌‌‌‌ సెట్టింగ్‌‌‌‌’ పేరుతో అమెరికన్‌‌‌‌ ఎంపీల కోసం కంగ్రెషనల్‌‌‌‌ రిసెర్చ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ ( సీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌)  ఈ రిపోర్ట్‌‌‌‌ను తయారుచేసింది.   రిపోర్టులో  ఆసక్తికరమైన అంశాలను ఎన్నింటినో  వెల్లడించింది. ‘‘అధికారంలోకి రాకముందు ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌కు ఎలాంటి పాలన అనుభవంలేదు.  నవాజ్‌‌‌‌ షరీఫ్‌‌‌‌ను ఎన్నికల్లో ఓడించడానికి పాకిస్తాన్‌‌‌‌ సెక్యూరిటీ సర్వీసెస్‌‌‌‌  దేశ రాజకీయాల్లో జోక్యం  చేసుకుంది. మిలటరీ,  న్యాయవ్యవస్థ కుమ్మక్కు కావడం వల్లే ఇమ్రాన్‌‌‌‌ఖాన్‌‌‌‌ ఆధ్వర్యంలోని  పాకిస్తాన్‌‌‌‌ తెహ్రీక్‌‌‌‌-ఇ- ఇన్సాఫ్‌‌‌‌ (పీటీఐ) జనరల్‌‌‌‌ ఎలక్షన్లో  ఘన విజయం సాధించింది’’ అని రిపోర్ట్‌‌‌‌ వివరించింది.

ఇమ్రాన్‌‌‌‌ ‘నయా పాకిస్తాన్‌‌‌‌’ విజన్‌‌‌‌పై

ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ ‘నయా పాకిస్తాన్‌‌‌‌’ విజన్‌‌‌‌పైనా సీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కీలక కామెంట్స్‌‌‌‌ చేసింది.  దేశాన్ని ‘ వెల్ఫేర్‌‌‌‌ స్టేట్‌‌‌‌’ గా మార్చాలని ఇమ్రాన్‌‌‌‌ అనుకున్నారు. విద్య, ఆరోగ్య సదుపాయాలను మరింతమందికి  అందేలా చేసి యూత్‌‌‌‌, అర్బన్‌‌‌‌, మిడిల్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఓటర్లను ఆకట్టుకోవాలని అనుకున్నా.. సాధ్యంకాలేదు. దేశం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడమే  దీనికి కారణమని రిపోర్ట్‌‌‌‌ వెల్లడించింది. ఇమ్రాన్‌‌‌‌ అనుకున్నవి సాధించాలంటే విదేశాల నుంచి ఆర్థిక సాయం రావాల్సి ఉందని, ప్రభుత్వం దుబారాను బాగా తగ్గించుకోవాలని చెప్పింది. బ్యాన్‌‌‌‌ చేసిన టెర్రరిస్టు గ్రూపులతో పాకిస్తాన్‌‌‌‌లోని చిన్న పార్టీలకు  సంబంధాలు ఉన్నాయని కూడా  సీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  తెలిపింది. ‘‘ప్రజాస్వామ్య విధానాలను ఎగతాళి చేస్తూ  చిన్న చిన్న పార్టీలు ఎన్నికల్లో పోటీ చేశాయి. బ్యాన్‌‌‌‌ చేసిన ఇస్లామిక్‌‌‌‌ టెర్రిరిస్టు గ్రూపులతో  ఈ పార్టీలకు సంబంధాలు ఉన్నాయి’’ అని సీఆర్ఎస్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌ వివరించింది.

సీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అంటే?

కంగ్రెషనల్‌‌‌‌ రిసెర్చ్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ ( సీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌) అన్నది యూఎస్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ కి చెందిన ఇండిపెండెంట్‌‌‌‌ రిసెర్చ్‌‌‌‌ వింగ్‌‌‌‌. ఎంపీలకు ఆసక్తి కలిగించే  అంశాలపై ఇది పిరియాడికల్‌‌‌‌గా రిపోర్టులను తయారుచేస్తుంది.  దీన్ని యూఎస్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ అధికారిక రిపోర్ట్‌‌‌‌గా భావించరు.