హైదరాబాద్ యూఎస్ కాన్సుటేల్లో జాబ్స్..జీతం రూ.60వేలు

హైదరాబాద్ యూఎస్ కాన్సుటేల్లో జాబ్స్..జీతం రూ.60వేలు

హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ లో ట్రావెల్ అసిస్టెంట్, నాన్ ఇమ్మిగ్రేంట్ వీసా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు -2. ఈ వేకెన్సీలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

అర్హత

ట్రావెల్ అసిస్టెంట్ పోస్టు:

ఈ పోస్టుకు అభ్యర్థులు ట్రావెలింగ్, హాస్పిటాలిటీ పరిశ్రమలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఇంగ్లీష్, హిందీ లేదా తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అభ్యర్థులు వివిధ ఎయిర్ లైన్స్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. ఎయిర్ లేదా రైలు టికెట్ల బుకింగ్, హోటల్ బుకింగ్ లపై ప్రభుత్వం విధించే పన్నులపై అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ఇమ్మిగ్రేషన్, ఎయిర్ పోర్ట్ అథారిటీ, ఇండియన్ కస్టమ్స్ లలో పనిచేసిన అనుభవం ఉండాలి. 

నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అసిస్టెంట్: 

ఈ పోస్టుకు హైస్కూల్ పూర్తి చేసిన వారు అర్హులు, అయితే వీరు తప్పనిసరిగా ఇంగ్లీషు ను రాయడం , చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఒరియాలో కూడా మాట్లాడటం, చదవడం, రాయడం వంటి స్కిల్స్ కలిగి ఉండాలి.

జీతం : 

హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ లో ఈ రెండు పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు  సంవత్సరానికి రూ. 7లక్షల, 35 వేల 015 లు చెల్లిస్తారు. దీంతోపాటు వారానికి 40 గంటల మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. 

అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకుhttps://in.usembassy.gov/embassy-consulates/hyderabad/సంప్రదించాలి. 

Also Read: రంగుల పండుగ హోలీని ఎక్కడెక్కడ ఎలా జరుపుకుంటారో తెలుసా?!