భారత రాయబారి వెళ్లిపోవాలి.. ఇక తెగతెంపులే : పాక్ మంత్రి

భారత రాయబారి వెళ్లిపోవాలి.. ఇక తెగతెంపులే : పాక్ మంత్రి

పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ఫవాద్ అహ్మద్ చౌద్రీ భారత్ ను ఉద్దేశించి తీవ్రమైన కామెంట్స్ చేశారు. భారత్ తో ఇక పాకిస్థాన్ తెగతెంపులే మిగిలాయని అన్నారు. “ఇండియాకు పాకిస్థాన్ తో మాట్లాడటం ఇష్టం లేనట్టుంది. భారత విదేశాంగ మంత్రిని ఇప్పుడే కోరుతున్నాం. మీదేశ రాయబారి ఇంకా పాకిస్థాన్ లో ఉండటం ఎందుకు? భారత్ తో దౌత్యపరమైన సంబంధాలను పాకిస్థాన్ తెంచుకోవాలి. మా రాయబారి అక్కడ.. వారి రాయబారి ఇక్కడ ఉండటం  ఎందుకు” అని ఆయన ప్రశ్నించారు. 

భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కు సూచిస్తూ.. ఫవాద్ అహ్మద్ చౌద్రీ ఈ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇండియన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.