ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో  సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి ప్రధానికి వినతి పత్రం అందించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఈనెల 4వ తేదీన 26 కొత్త జిల్లాల ఏర్పాటు చేసిన అనంతరం ఢిల్లీకి వచ్చి  ప్రధానిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి కొనసాగింపు, మూడు రాజధానుల ఏర్పాటు అలాగే పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత, రాష్ట్ర పునర్విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు, తెలంగాణ విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలు, తెలంగాణ నుంచి రాష్ట్రానికి బకాయిలు, కడప స్టీల్‌ ప్లాంట్  తదితర అంశాలను ప్రధాన మంత్రికి నివేదించినట్లు అధికార వర్గాల సమాచారం. 
నిర్మలా సీతారామన్ తో జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‎తో కూడా భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన అంశాలను అంతకుముందే  ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లిన జగన్ ఆర్ధికాంశాలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలియజేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లిన  జగన్ అక్కడ ఆమెతో భేటీ అయి ఏపీ సమస్యలపై చర్చించారు. వీరి భేటీ ముగిసిన తర్వాత పలువురు కేంద్రమంత్రులను కూడా కలవనున్నారు. ముఖ్యంగా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కానున్నారు. 

 

ఇవి కూడా చదవండి

చండీగఢ్ను ఉమ్మడి రాజధానిగానే ఉంచాలి: హర్యానా తీర్మానం

దొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ

డబల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం లేదని అర్ధరాత్రి ఏం చేశారంటే..

అజీమ్ ప్రేమ్జీ జీవితం అందరికీ ఆదర్శం

ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన