ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ నిర్వహిస్తోన్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని రాయచూర్ కేంద్రంగా కాల్ సెంటర్ నిర్వహిస్తోన్న ముఠా.. కూకట్ పల్లిలో లేబర్లను టార్గెట్ గా చేసుకుని వారి పేర్ల మీద బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తోంది. అంతేగాకుండా ఈ అకౌంట్లను సైబర్ క్రైమ్స్ కు వాడుతోంది.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి శ్రీ వివరాల ప్రకారం.. కర్ణాటకలోని రాయచూర్ కేంద్రగా కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సత్యనారాయణ వర్మ అనే వ్యక్తిని విచారించగా.. కూకట్ పల్లి నుంచి ఇద్దరు అకౌంట్ లు ఓపెన్ చేసి బెట్టింగ్ యాప్ కు వాడుతున్నట్లు సమాచారంతో అరెస్ట్ చేశాం. వైన్స్ , కల్లు కాంపౌండ్ ల వద్ద లేబర్ నే టార్గెట్ చేస్తూ వాళ్ల ఐడితో అకౌంట్ ఓపెన్ చేస్తోంది ముఠా. దాదాపు 100 బ్యాంక్ అకౌంట్ లు ఉన్నాయి, 14 లక్షలు సీజ్ చేశాం, 7 అకౌంట్ లో కోటి రూపాయలు గుర్తించాం. బెట్టింగ్ కు కాకుండా సైబర్ క్రైమ్స్ కు ఈ అకౌంట్ వాడుతున్నారు. అకౌంట్ ఓపెన్ కి 1000 రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు ఇచ్చారు. వారి పై కూడా కేసులు నమోదు చేస్తున్నాం. సూపగో వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారు. రెండు ల్యాప్ టాప్, 30 మొబైల్ ఫోన్స్, 32 చెక్ బుక్స్ , 23 ఎటిఎంలు , 48 సిమ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు.
►ALSO READ | ఏపీకే ఫైల్స్ తో ..హైదరాబాద్ లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి రూ.13 లక్షలు టోకరా
