లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభంలో ఉండగా.. నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 75.95 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ సూచీలో ఐటీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెరిగిన చమురు ధరలు దిగిరావడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచింది. మరోవైపు రష్యా డిమాండ్లను సీరియస్ గా పరిశీలిస్తున్నామని.. యుద్ధాన్ని వెంటనే ఆపడమే తమ లక్ష్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నుంచి ప్రకటన వెలువడటం సానుకూలాంశంగా మారిందని మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

తిరుమలలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

జెలెన్స్కీని వదలను.. పుతిన్ వార్నింగ్

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు