హెచ్‌1-బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం

హెచ్‌1-బీ వీసాలపై ట్రంప్ కీలక నిర్ణయం

ఒకపక్క కరోనాతో సతమతమవుతుంటే.. మరోపక్క అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబులాంటి వార్తా పేల్చారు. హెచ్‌1-బీ వీసాలను ఈ సంవత్సరం చివరి వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఉద్యోగవేటలో అమెరికా వెళ్లే మన దేశ పౌరులకు కళ్లేం పడ్డట్టే అయింది. అమెరికాలో నిరుద్యోగ తీవ్రతను త‌గ్గించుకోవ‌డం కోసం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెచ్‌1-బీ వీసాలతో పాటు అన్ని ర‌కాల టెంప‌ర‌రీ వ‌ర్క్ వీసాల‌పై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ నిషేధానికి సంబంధించి మంగ‌ళ‌వారం ఆర్డర్స్ జారీచేశారు. ఎల్-1పై అమెరికా వెళ్లిన భారత టెకీలు ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు తలలు పట్టుకున్నారు. వీరంతా తాజాగా హెచ్‌1-బీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు హెచ్‌1-బీ నిలిపివేయడంతో వారికి ఏంచేయాలో తోచని పరిస్థితి.

ఈ ఏడాది మార్చిలో దాదాపు 1.67 లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తు చేయగా వారిలో 70 వేల మంది లాటరీలో ఎంపికయ్యారు. వారికి వీసాలు జారీ చేసే ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. ఈసారి కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలోని పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలు మూతపడటంతో వీసాల జారీ ఆలస్యమయింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 8 వేల మంది హెచ్‌1బీ వీసాలు పొందారు.  హెచ్‌1బీ వీసాల‌ కోసం మొత్తం 85 వేల స్పాట్స్ అందుబాటులో ఉండ‌గా.. 2.25 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు అధికారులు చెప్పారు.

ట్రంప్ ఆదేశాల ప్రకారం.. జూన్ 24 నుంచి వ‌ర్క్ వీసాల‌పై నిషేధం అమల్లోకి వ‌స్తుంది. ఈ నిషేధం డిసెంబర్ 31, 2020 వరకు అమ‌ల్లో ఉంటుంద‌ని అమెరికా అధికారికంగా ప్ర‌క‌టించింది. నాన్-ఇమ్మిగ్రాంట్ వీసాలేని వారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అమెరికా పౌర‌స‌త్వం ఉన్న‌వారి ఫ్యామిలీ మెంబర్స్ కు ఈ ఆదేశాలు వర్తించవని పేర్కొంది. అదేవిధంగా ఆహార స‌ర‌ఫ‌రా రంగంలో ఉన్న వారికి కూడా ఈ నిషేధం వ‌ర్తంచ‌ద‌ని తెలిపింది. విదేశాల నుంచి వచ్చే ఉద్యోగుల వల్ల తమ దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెరికా వెల్ల‌డించింది.

ట్రంప్ ఈ నిర్ణయాన్ని తన స్వలాభం కోసమే తీసుకున్నారని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో వ‌చ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో అమెరికన్లకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, అమెరికాలో ప్రస్తుతం ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో ట్రంప్ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

For More News..

షెల్టర్ హోంలో 57 మంది అమ్మాయిలకు కరోనా.. ఐదుగురు మైనర్లకు ప్రెగ్నెన్సీ

కిరాణా కొట్టు బాకీలు వసూల్ చేసిన వ్యక్తే.. స్టేట్ బ్యాంక్ రికవరీ హెడ్

పాక్‌ టీమ్‌లో ముగ్గురికి కరోనా