రూ.538 కోట్ల మోసం.. జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ పై ఈడీ ప్రశ్నల వర్షం

రూ.538 కోట్ల మోసం.. జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ పై ఈడీ ప్రశ్నల వర్షం

కెనరా బ్యాంక్‌ను రూ.538 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చాలా గంటలుగా ప్రశ్నిస్తోంది. ఖాతాల్లో అవకతవకలు, రుణం మొత్తంలో కొంత భాగాన్ని సంబంధిత కంపెనీలకు కమీషన్‌గా మళ్లించడం, మనీలాండరింగ్ పై వచ్చిన ఆరోపణలపై గోయల్ ను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. నిధుల లావాదేవీలకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పత్రాల గురించి సైతం ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

Also Read : సూర్యుడు వైపు దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1 : నాలుగు నెలల టైం.. 15 లక్షల కిలోమీటర్ల జర్నీ

రూ. 538 కోట్ల విలువైన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జూలై 2023లో ముంబై, ఢిల్లీలోని ఎనిమిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో నరేష్ గోయల్, ఇతరులు ఉన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఇప్పటికే గోయల్‌పై కేసును దర్యాప్తు చేస్తోంది. కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్, రికవరీ అండ్ లీగల్ సెక్షన్ ఫిర్యాదుపై గోయల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్‌వేస్‌కు రూ.848.86 కోట్ల రుణాలు అందించామని, రూ.538.62 కోట్ల బకాయిలు ఉన్నాయని బ్యాంక్ ఆరోపించింది. ఎయిర్‌లైన్ రుణంలో కొంత భాగాన్ని కమీషన్‌గా సంబంధిత కంపెనీలకు మళ్లించిందని చెప్పింది.