ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఆస్తుల అటాచ్ మెంట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఆస్తుల అటాచ్ మెంట్

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి ఆస్తుల అటాచ్ మెంట్​కు ఈడీ రంగం సిద్ధం చేసింది. లిక్కర్ దందాలో వచ్చిన లాభాలతో సౌత్ గ్రూప్ కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు తెలిసింది. ఈ కేసులో పలుసార్లు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఈడీ.. పెద్ద ఎత్తున ఆస్తుల వివరాలను సేకరించింది. ఇందులో భాగంగా జనవరిలో రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. ఈ క్రమంలోనే లిక్కర్ దందాలో వచ్చిన లాభాలు మొదట ఇండో స్పిరిట్స్ కంపెనీకి రాగా, అక్కడి నుంచి వచ్చిన డబ్బులతో సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేసిన ఆస్తులను ఇప్పుడు అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుంది. ఇందుకోసం ఢిల్లీ రౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవెన్యూ కోర్టు అనుమతి కోరనుంది. సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మూడు, నాలుగు ప్రాపర్టీలను ఈడీ అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం ఉంది. 

ఇప్పటికే 76 కోట్ల ఆస్తులు సీజ్.. 

లిక్కర్ పాలసీలో మార్పులతో ఢిల్లీ సర్కార్ కు రూ.2,873 కోట్లు నష్టం వచ్చిందని ఈడీ గుర్తించింది. పాలసీలో మార్పులు చేయడం ద్వారా అధికారులకు అందిన ముడుపులు, టెండర్లు దక్కించుకున్న కంపెనీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా లిక్కర్ కంపెనీలకు వచ్చిన లాభాల వివరాలు సేకరించింది. ఈ క్రమంలో లిక్కర్ కంపెనీలు, నిందితుల ఆస్తులను మరోసారి అటాచ్ చేసేందుకు చర్యలు చేపట్టింది. కాగా, ఈడీ ఇప్పటికే  రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో ఇండో స్పిరిట్స్ ఎండీ సమీర్ మహేంద్రు, ఆయన భార్య పేరుతో ఉన్న రూ.35 కోట్ల విలువైన ఆస్తులు.. గుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరోరాకు చెందిన రూ.7.68 కోట్ల రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీ, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రూ.1.77 కోట్ల అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దినేశ్ అరోరాకు చెందిన 3.18 కోట్ల రెస్టారెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అరుణ్ పిళ్లైకి చెందిన 2.5 ఎకరాలు ఉన్నాయి.

అటాచ్ చేసే ఆస్తులివే!

లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దందాలో వచ్చిన లాభాలతో సౌత్ గ్రూప్ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను ఇటీవల ఫైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈడీ వెల్లడిం చింది. ఇందులో ఫీనిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రూపుకు చెందిన శ్రీహరి నుంచి సీఏ గోరంట్ల బుచ్చిబాబు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రోత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరిట భూమి కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ కంపెనీలో కవిత, ఆమె భర్త అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పేర్కొంది. దీంతో పాటు ఫీనిక్స్ శ్రీహరి నుంచి బుచ్చిబాబు ద్వారా మరో 25 వేల చదర పు అడుగుల ల్యాండ్​ను కవిత కొనుగోలు చేసినట్లు వివరించింది. మరోవైపు క్రియేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన రవిశంకర్ చెట్టి వద్ద రంగారెడ్డి జిల్లా వట్టినాగుల పల్లిలో అరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామచంద్ర పిళ్లై రూ.5 కోట్లతో 3 నుంచి 4 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఈడీ తెలిపింది. వీటికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. కేసు విచార ణ ముగిసేంత వరకు ఈ ఆస్తులను అమ్మకుండా అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు కోర్టు అనుమతి కోరనుంది.