రష్యా మా సాయం కోరలే.. చైనా క్లారిటీ

రష్యా మా సాయం కోరలే.. చైనా క్లారిటీ

ఉక్రెయిన్, రష్యా యుద్ధం క్రమంలో... అమెరికా, చైనాలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ పై దాడులకు సైనిక సామగ్రి, ఆయుధాలు అందించాలని రష్యా చైనాను అభ్యర్థించినట్టు స్టోరీస్ రావడంపై మండిపడ్డారు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాక్  సులివన్ . పలు దేశాలు విధించిన ఆంక్షలను బ్రేక్ చేసేలా రష్యాకు హెల్ప్ చేయవద్దని హెచ్చరించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడుల గురించి అమెరికా, చైనా ప్రతినిధులు రోమ్ లో భేటీ అయ్యారు. అమెరికా తరఫున సులివన్ , చైనా తరఫున ఆ దేశ విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్  జీచీ హాజరయ్యారు. సులివన్  హెచ్చరికలపై చైనా స్పందించింది. తమ నుంచి రష్యా సాయం కోరలేదని వాషింగ్టన్ లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి లీ పెంగ్యూ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

కరోనా పరిహారం కోసం ఫేక్ డెత్ సర్టిఫికెట్లు

రష్యాలో ఫైజర్ పెట్టుబడులు బంద్

ఈ ఫుడ్స్ కిడ్నీలకు దోస్తులు