కరోనా కట్టిడికి హై అలర్ట్ ప్రకటించిన చైనా

కరోనా కట్టిడికి హై అలర్ట్ ప్రకటించిన చైనా
  • షాంఘై సిటీలో కరోనాతో ఒక్కరోజులోనే 39 మంది మృతి

బీజింగ్: కరోనా మళ్లీ విజృంభిరిస్తుండడంతో చైనా రాజధాని బీజింగ్ లో హై అలర్ట్ ప్రకటించారు. కరోనా వ్యాప్తితో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అధికారులు. సిటీలో వారం రోజులుగా బయటపడని రీతిలో వైరస్ వ్యాప్తి స్టార్ట్ అయిందని బీజింగ్ లోని వ్యాధుల నియంత్రణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ పాంగ్ జిన్ ఘువో తెలిపారు. అందరూ ఇన్ ఫెక్షన్ బారిన పడుతున్నారని... వారి విస్తృత కార్యకలాపాల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందన్నారు. ఇలాంటి క్లస్టర్లు పెరుగుతున్నాయని... స్కూళ్లు, కుటుంబాలు, పర్యాటకులతో కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపారు. దీంతో గుర్తించిన క్లస్టర్లలో భవన నిర్మాణ కార్మికులు, బడుల్లో పనిచేసేవారికి  టెస్టులు నిర్వహించారు. 
బయటపడని రీతిలో వైరస్ వ్యాప్తి
కొవిడ్ కట్టడికి బీజింగ్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత కాయికీ, మేయర్ చెన్ జినింగ్, ఇతర నగర నేతలు రెండు సార్లు భేటీ అయ్యారు. బయటపడని రీతిలో వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు గుర్తించడంతో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా కీలక గ్రూపులకు న్యూక్లియర్ యాసిడ్ టెస్టుల నిర్వహణ... క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లో క్లాసుల నిర్వహణ నిలిపివేయడం వంటి చర్యలు చేపడుతున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కడి నుంచి జరుగుతోందన్నది తెలియడం  లేదని, విస్తృత రీతిలో ఇన్ ఫెక్షన్లు సోకే ముప్పు తీవ్రంగానే ఉందని పెకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాంగ్ యుఏడెన్ తెలిపారు. రానున్న మేడే సెలవుల్లో వారం రోజుల పాటు లక్షల మంది  ప్రజలు ప్రయాణాలు చేసే అవకాశం ఉండటంతో... వైరస్ వ్యాప్తి ముప్పు పెరిగే అవకాశముందని అంచనా వేశారు.
చైనాలో తొలిసారిగా ఒక్కరోజులోనే 29 మంది మృతి
చైనాలో అతి పెద్ద సిటీ షాంఘైలో కరోనాతో ఒక్కరోజులోనే 39 మంది చనిపోయారు. గత నెల నుంచి కరోనా విజృంభణ మొదలైన తర్వాత ఒక్కరోజులో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. చైనాలో దేశ వ్యాప్తంగా 21 వేల 796 కొత్త కేసులు నమోదైనట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. యాక్టివ్ కేసులు 29 వేల 531కి చేరింది.  బీజింగ్ లో కొత్తగా 22 కేసులు బయటపడ్డాయి.
కొనసాగుతున్న జీరో కోవిడ్ వ్యూహం
చైనా జీరో కొవిడ్ విధానాన్ని అవలంభిస్తుండటంతో.. మహమ్మారి కట్టడికి షాంఘైలోని అనేక ప్రాంతాలు, వీధులు, అపార్ట్ మెంట్లకు వెళ్లే మార్గాల్లో లోహపు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. దిగువ స్థాయి ప్రభుత్వ సిబ్బంది, వాలంటీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలెవరూ రాకపోకలు సాగించడానికి వీల్లేని విధంగా ఏర్పాట్లు చేశారు. 

 

ఇవి కూడా చదవండి

ప్రాజెక్టు కాలువలను పరిశీలించిన స్మిత సబర్వాల్

పాండవులగుట్టకు యునెస్కో గుర్తింపు కోసం కృషి 

స్విమ్మింగ్ పూల్ను ప్రారంభించిన సినీనటి వరలక్ష్మి శరత్ కుమార్

డబుల్ బెడ్రూం ఇళ్లపై 2 నెలల్లో నివేదిక ఇవ్వండి