జమిలి ఎన్నికలు పెడితే ఈడీ, సీబీఐపై ఆ అపవాదు రాదు

జమిలి ఎన్నికలు పెడితే ఈడీ, సీబీఐపై ఆ అపవాదు రాదు

దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తోందన్న ప్రతిపక్షాలు ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోడీ తిప్పికొట్టారు. నిబంధలన ప్రకారమే ఈడీ, సీబీఐ సహా అన్ని దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఆయన ఇవాళ ప్రముఖ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు. అవినీతి వల్ల దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక దర్యాప్తు సంస్థలు  అక్రమార్కులపై రైడ్స్ చేసి అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగిస్తున్నాయని, ఈ పని చేస్తున్నందుకు తమ ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసించాలని అన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులపై ప్రజలు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తారని, వాళ్లపై తాను ఎటువంటి చర్యలు తీసుకోకుంటే ప్రజలు తనను క్షమించరని మోడీ చెప్పారు. అవినీతిపరుల గురించి తమ ప్రభుత్వానికి ఎప్పుడు సమాచారం అందితే దీనిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్నించారు. అక్రమార్కులపై రైడ్స్ చేయడం వల్ల వేల, లక్షల కోట్లు దేశ ఖజానాలో వచ్చి చేరుతుంటే.. తనను ప్రశంసించాల్సిన అవసరం లేదా అని అన్నారు.

జమిలి ఎన్నికలపైనా ప్రస్తావన..

జమిలి ఎన్నికలు వస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని, ఎన్నికల ముందే తమ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల రైడ్స్ జరుగుతున్నాయన్న అపవాదు రాదని మోడీ అన్నారు. దేశంలో ఎప్పుడూ ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని, అందుకని ప్రభుత్వం పని చేయడం మానేయాలా అని ఆయన ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రం ఒకేసారి ఎన్నికలకు వెళ్తే డబ్బు కూడా చాలా ఆదా అవుతుందని అన్నారు. పైగా ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను కూడా ఎన్నికల ముందే దాడులు చేస్తున్నాయన్న కోణంలోనూ చూడరని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఒకే కుటుంబంలో 45 మందికి పదవులా?

పాకిస్థాన్ మంత్రికి అసదుద్దీన్ ఒవైసీ చురకలు

మమ్మల్ని గెలిపిస్తే.. బైక్పై ముగ్గురు వెళ్లినా నో చలాన్