బీజేపీని వీడిన మాజీ సీఎం కుమారుడు

V6 Velugu Posted on Jan 21, 2022

పనాజీ: గోవా మాజీ సీఎం, దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఉత్పల్ ప్రకటించారు. తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన పనాజీ టికెట్ తనకు ఇవ్వాలని బీజేపీ అధిష్టానాన్ని ఉత్పల్ కోరారు. దీని కోసం చివరి వరకూ ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే పార్టీ మొగ్గుచూపడంతో ఉత్పల్ నిరాశ చెందారు. ఇతర స్థానాల్లో టికెట్ ఇస్తామని బీజేపీ నాయకత్వం ఇచ్చిన ఆఫర్ కు ఆయన నో చెప్పారని సమాచారం. బీజేపీ నుంచి బయటకు వచ్చానని.. ఎన్నికల బరిలో స్వతంత్రంగా దిగనున్నట్లు ఉత్పల్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలయ్యేనా?

రైతుల ఇళ్లకు తాళాలు.. ఖమ్మం డీసీసీబీ అధికారుల అత్యుత్సాహం

ఇమ్యూనిటీ ఫుడ్ ఇస్తలే.. గాంధీలో కరోనా పేషెంట్ల ఆవేదన

Tagged Bjp, utpal parrikar, manohar parrikar, Goa elections, Assembly Elections 2022

Latest Videos

Subscribe Now

More News