మల్టీఫ్లెక్స్ బిజినెస్‌లోకి విజయ్ దేవరకొండ

V6 Velugu Posted on Sep 18, 2021

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ టైంలో  స్టార్ హీరోగా   గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలతోనే కాకుండా సొంతంగా బిజినెస్ లు  చేస్తూ రాణిస్తున్నారు. రౌడీ బ్రాండ్ పేరుతో టెక్స్ టైల్ బిజినెస్ ను విజయవంతంగా చేస్తున్న విజయ్..ఇప్పుడు మల్టిఫ్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అగ్రశ్రేణి పంపిణీ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలిసి దేవరకొండ మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు.

తన స్వస్థలమైన మహాబూబ్‌నగర్‌లో ఈ మల్టీప్లెక్స్‌ థియేటర్ ను ఏర్పాటు చేసారు విజయ్ దేవర కొండ. మల్టీప్లెక్స్‌కు AVD సినిమాస్ అని పేరు పెట్టారు. ఈ థియేటర్ లో మొదటగా లవ్ స్టోరీ మూవీ ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 24 న విడుదల కాబోతున్న ఈ మూవీ తో విజయ్ థియేటర్ బిజినెస్ ప్రారంభం కానుంది. 

గతంలో ఏషియన్ సినిమాస్ తోనే కలసి మహేష్ బాబు AMB సినిమాస్ ను స్టార్ట్ చేసారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్ తో అమీర్ పేట సత్యం థియేటర్ ప్లేస్‌లో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.  ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా వారి జాబితాలో చేరారు.

Tagged Vijay Devarakonda,  Enter, Multiplex Business

Latest Videos

Subscribe Now

More News