కన్నకూతురిని కిరాతకంగా కొట్టిన్న తండ్రి.. తల్లి నవ్వులు

V6 Velugu Posted on Sep 21, 2021

పసిపిల్లలన్నాక.. అల్లరి చేయడం, తిండి తినకుండా మారాం చేయడం మామూలు విషయమే. ఎంత సేటికీ బువ్వ తినకపోతే పిల్లల్ని ఎత్తుకుని తిప్పుతూనో, బుజ్జగిస్తూనో తినిపిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ మెదక్‌లో ఓ చిన్నారి పేరెంట్స్‌ కిరాతకంగా పసిపిల్ల అని కూడా చూడకుండా హింసించారు. తిండి తినడం లేదని తండ్రి ఘోరంగా కొట్టాడు. తాడు తీసుకుని గొడ్డును బాదినట్టు బాదేశాడు. ఇంత చేస్తున్నా ఎదురుగానే ఉన్న తల్లి అడ్డుకోవాల్సింది పోయి.. ఆ ఇద్దరినీ చూసి నవ్వుతోంది. ఈ ఘటన ఆదివారం జరగగా.. పక్కింటి వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. 

ఆరు బయట కూర్చుని చిన్నారికి బువ్వ పెడుతుండగా.. ఆ పాప తినకపోవడంతో తండ్రి తాడుతో కొట్టడం, చెంప దెబ్బకొట్టడం చూస్తూ తల్లి నవ్వుడం ఆ వీడియోలో కనిపింస్తోంది. ఆమె ఆ తర్వాత కొద్దిసేపటికి ఇంటిలోకి వెళ్లిపోవడంతో ఆ తండ్రి మరింత రెచ్చిపోయాడు. పాప మెడ పట్టుకుని పైకి లేపి కొట్టాడు. ఒక్కసారిగా నేలపై పడేసి ఇంట్లోకి వెళ్లిపోయి తలుపుపెట్టుకున్నాడు. ఆ చిన్నారి ఏడుస్తున్నా సరే తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ సముదాయించే ప్రయత్నం చేయలేదు.  నాగరాజు కూతురును కొడుతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు డయల్​ 100 కు కాల్​చేసి చెప్పడంతో టౌన్​ పోలీసులు నాగరాజు, వెన్నెలను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అన్నం తినకుండా సతాయించినందువల్ల కొట్టానని నాగరాజు ఒప్పుకున్నాడని, మరోసారి ఇలా చేయొద్దని హెచ్చరించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళ ఆ చిన్నారి సవతి తల్లి అని తెలుస్తోంది.

Read More:

కన్యా దానం: దానమిచ్చేందుకు నేనేమైనా వస్తువునా?

వైట్ ఛాలెంజ్ ప్రకంపనలు.. అసలు దీని హిస్టరీ ఏంటి?

వైరల్ వీడియో: స్టాలిన్ సీక్రెట్ అడిగిన మహిళ.. సిగ్గుపడుతూ చెప్పిన సీఎం

ఆర్మీ హెలికాప్టర్ కూలి.. ఇద్దరి మృతి

ఆ స్వామీజీది హత్యా? ఆత్మహత్యా?

Tagged food, Viral Video, Medak, father, daughter

Latest Videos

Subscribe Now

More News